ATP: కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూర్లో ఆదివారం జరిగిన బైపాస్ గణేశ్ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. నాయక్ సంఘం నాయకుడు ఆర్. అశోక్ కుమార్, బైపాస్ గణేశ్ కమిటీ అధ్య క్షుడు రవికుమార్, ప్రభు, రఘు, గంగాధరప్ప పాల్గొన్నారు.