NLG: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పెన్షన్లను పెంచాలని ఎమ్మార్పీఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు మేడి కృష్ణ డిమాండ్ చేశారు. వికలాంగులకు 6 వేలు, ఇతరులకు 4వేలు పెన్షన్లు పెంచి ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు పింఛన్ దారులతో చిట్యాలలో సోమవారం తహసీల్దారు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.