PLD: నకరికల్లు మండలం కుంకలగుంటలో కాలువలో పడి రెండేళ్ల బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు కుంకలగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని పంట కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాలుడు ఇంటి బయట అరుగుపై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయినట్లు తెలిపారు.