AP: స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర కీలకమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రస్తుతం అనేక రంగాల్లో మహిళలు అత్యున్నతపాత్ర పోషిస్తున్నారని, పార్టీలకు అతీతంగా మహిళా సాధికారత కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. ఆస్తిలో మహిళలకు వాటా ఇవ్వాలని చట్టం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మహిళా సాధికారత సదస్సు జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు.