NLG: సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు మునుగోడు మండలం పలివెల గ్రామంలోని సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MLC నెల్లికంటి సత్యం CPI జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ పోరాటంలో అసువులు బాసిన కొండవీటి బుచ్చిరెడ్డి, గురునాథ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటాల యోధుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు.