KNR: కొత్తపల్లి మండలం రేకుర్తిలోని సింహాద్రి కాలనీ రోడ్ నంబర్ 3లో ఉరేసుకుని నారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్ల స్థానికులు తెలిపారు. ఇంట్లోనివారు ఆదివారం చూసేసరికి ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ ఉరేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.