ELR: తుఫాన్ ప్రభావంతో ఉధృతంగా వచ్చిన వరదల కారణంగా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం కాజ్వే కొట్టుకుపోయింది. ఈ పరిస్థితిని ఆదివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.