KMM: జీళ్ల చెరువులో వేంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో జగన్మోహన్ రావు, ఛైర్మన్ అంబాల వెంకటలక్ష్మి తెలిపారు. భక్తులందరూ హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.