కోనసీమ: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.