IND-PAK మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఇరుదేశాలు నేడు తలపడనున్నాయి. ఫార్మాట్ ఏదైనా దాయాదుల పోరు అంటే ప్రపంచ క్రికెట్‌కి పండుగే. అయితే పెహల్గాం దాడి నేపథ్యంలో ఈ సారి ఒకప్పటిలా ఉత్కంఠ లేదు. ఇప్పటికే బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ మ్యాచ్ ఇరుజట్లకూ ప్రతిష్ఠాత్మకమనే చెప్పాలి. విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాయనడంతో సందేహం లేదు.