అల్లూరి: జిల్లా అదనపు ఎస్పీ కే.ధీరజ్ ను అన్నమయ్య జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ధీరజ్ శిక్షణ పూర్తి చేసుకుని, 2023లో పాడేరు ఏఎస్పీగా చేరారు. తరువాత రంపచోడవరం ఏఎస్పీగా పనిచేస్తూ, గత ఏడాది జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. తాజా బదిలీల్లో అన్నమయ్య జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.