BHPL: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన రామాలయంలో ఈ నెల 15, 16 తేదీల్లో గోకులాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 15న రాత్రి 7:30 గంటలకు ప్రత్యేక పూజలు, శ్రీకృష్ణ జనన ఘట్టము, భజన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈవో మహేష్ తెలిపారు. 16న ఉదయం 9:30 గంటలకు రామాలయం నుంచి ఊరేగింపు సేవ, గోపాలకృష్ణ కాలువలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఉంటాయన్నారు.