KKD: పిఠాపురంలో ఆదివారం నిర్వహించనున్న జిల్లాస్థాయి యోగా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేశామని యోగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సత్యప్రియ తెలిపారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోటీలు జరుగుతా యన్నారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.