KMM: ఉపాధ్యాయులు సర్వీస్ లో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పక ఉత్తీర్ణత సాధించాలంటూ కోర్టు తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు కష్టంగా మారిందని TSUTF జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ..రాష్ట్రప్రభుత్వం తీర్పుపై అప్పీల్ చేసి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు.