SDPT: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను సిద్దిపేట బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు గణవేశ దారి ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సిద్దిపేట జిల్లా కార్యవాహ అమరేందర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందించాలని, దేశం, ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని అన్నారు.