SRD: మిలాద్ ఉన్ నబి సందర్భంగా ఆదివారం SRDలో నాల్ సాబ్ గడ్డ మదీనా చౌరస్తాలో ఖవ్వాలి కార్యక్రమం ఘనంగా జరిగింది. హాఫిజ్ షేక్ షఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.