BDK: ఏజెన్సీ ప్రాంతాల పేదలకు వైద్య సేవలు అందించి వారికి బాసటగా నిలవడమే లయన్స్ క్లబ్ స్టార్స్ ముఖ్య ఉద్దేశమని అశ్వాపురం లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ నలగట్ల సత్య ప్రకాష్ తెలిపారు. ఆదివారం మండలంలోని గొందిగూడెం కొత్తూరు గ్రామంలో డాక్టర్ అజయ్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా వివిధ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.