GDWL: రాజోలి మండలం తూర్పు గార్లపాడు శివారులో ఇవాళ ఉదయం కరెంట్ షాక్తో తుమ్మలపల్లి శివ (28) అనే యువకుడు మృతి చెందాడు. పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదావశాత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి సోమేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని కలిగించింది.