GDWL: గద్వాల నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ఉచిత విద్యుత్ తదితర పథకాలు ఇస్తుందని పేర్కొన్నారు.