GDWL: అయిజ పట్టణంలో మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆదివారం ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నడిమి మసీద్ నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రవక్త సర్వమానవాళికి శాంతి సందేశం ఇచ్చారని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.