మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 15, 16వ తేదీలలో దోస్త్ ద్వారా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకుని వివరాలను కళాశాలలో అందజేయాలన్నారు. ఈనెల 17వ తేదీన ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు.