AP: సర్వే ఉద్యోగుల సంఘ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక నవంబరు 23న జరగనుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ వెల్లడించారు. ప్రస్తుత కార్యవర్గానికి మూడేళ్లు పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డివిజన్, జిల్లా కార్యవర్గ యూనిట్లకు ఎన్నికల షెడ్యూల్, ఓటరు జాబితా, రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ప్రొసీడింగ్స్ జారీ చేసినట్లు తెలిపారు.