AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు. ఇంటింటి సర్వే, వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. కాలనీలో మొత్తం 273 మంది బాధితులు ఉండగా.. 121 మంది డిశ్చార్జ్, 152 మందికి చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. మంచినీటి శాంపిల్స్ నివేదికలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది.