PPM: సాలూరు మండలంలోని కరసువలస గ్రామంలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో పిల్లల్ని చూడాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కూడా పిల్లల్ని చూడడానికి మధ్యాహ్నం వరకు వేచి చూస్తున్నామని.. ఆదివారం కూడా యూనిఫాం వేసుకోమని చెప్పడం విడ్డూరం అని అంటున్నారు. ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరారు.