MBNR: తిరుపతి పర్యటనలో భాగంగా ఎంపీ, విమెన్ ఎంపవర్మెంట్ కమిటీ సభ్యురాలు డీకే.అరుణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం కమిటీ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్న ఆమెకు టీటీడీ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికి, దర్శనం కలిగించి, శ్వేత వస్త్రాలు అందించారు. అర్చకులు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.