KMR: గత వారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా జుక్కల్ మండలంలోని సవర్గావ్ గ్రామం శివారులో పెసర పంట మొలకలేవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆశించిన సమయంలో వర్షం కురవకపోవడం, ఇప్పుడు చేతికి వచ్చిన పంట వాన పాలైపోవడంతో అన్నదాతలు కన్నీటితో ఉన్నారు. మొలకెత్తిన పెసర్లు కొంటలేని యజమానులు దారులు వెతుకుతున్నారు.