ELR: ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు ఓ ఫౌండేషన్ కొత్త బొలెరోను శుక్రవారం అందజేసింది. MLA బడేటి చంటి ద్వారా SP కె. ప్రతాప్ శివ కిశోర్‌కు అందించారు. ఈ సందర్భంగా MLA పోలీస్ సేవలను ప్రశంసించి మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. SP మాట్లాడుతూ.. కొత్త వాహనం ట్రాఫిక్ నియంత్రణకు దోహదం చేస్తుందని తెలిపారు.