అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తోన్న మూవీ ‘లెనిన్’. ఈ మూవీ షూటింగ్ 80% పూర్తయింది. దీని క్లైమాక్స్‌ను షూట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెల చివరిలో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారట. అనంతరం అఖిల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నవంబర్ 14న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.