BHPL: గోరికొత్తపల్లి మండలం చెంచుపల్లి గ్రామంలో 16 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆదివారం ఉదయం MLA గండ్ర సత్యనారాయణ రావు నూతన రేషన్ కార్డును పంపిణీ చేశారు. అనంతరం రూ.143.19 లక్షలతో చెంచుపల్లి నుంచి రేగొండ మండల కేంద్రం వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.