ADB: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో పోడు భూముల సమస్య జటిలమైంది. జన్నారం మండలంలోని పాలగోరిలో ఉన్న తమ పూర్వీకుల భూములను ఇవ్వాలని ఆదివాసులు పోరుబాట పట్టారు. అదే సమయంలో దండేపల్లి మండలంలోని లింగాపూర్ దమ్మన్నపేటలో కూడా ఆదివాసులు అటవీ భూములు ఇవ్వాలంటూ పోరు సాగిస్తున్నారు. ఆదివాసులకు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.