E.G: నిడదవోలు వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కంసాలిపాలెం నుంచి మాధవరం వెళ్లే మార్గం మధ్యనున్న కాలువ రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఆ రోడ్డు నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉద్ధృతి తగ్గే వరకు అటువైపుగా వెళ్లొద్దని తెలిపారు.