HYD: జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ ఆకాశం సాధారణంగా మేఘావృతంగా ఉండి.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30- 40KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠం 23°C ఉండే అవకాశం ఉందని తెలిపింది.