KMM: సింగరేణి సంస్థ మహిళా సాధికారత దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎండీ బలరామ్ ఆదేశాల మేరకు ఇకపై ఓసీలో మహిళా ఆపరేటర్లు, జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓసీల్లో యంత్రాలను నడిపే ఆపరేటర్లుగా పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.