W.G: మొగల్తూరులో 5 రోజుల క్రితం జరిగిన నడివీధి ముత్యాలమ్మ ఆలయ దగ్ధం కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన చేపల వ్యాపారి తోట శ్రీను ఆలయానికి నిప్పుపెట్టినట్లు అదనపు ఎస్పీ భీమారావు తెలిపారు. దశాబ్దాలుగా పూరిపాకలో ఉంటూ వస్తున్న అమ్మవారి ఆలయసాంప్రదాయాన్ని పక్కనపెట్టి కమిటీ నిర్మాణపనులు చేపట్టడాన్ని నచ్చక నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు వివరాలు వెల్లడించారు.