AP: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, అమరావతి-తిరుపతి మధ్య దట్టమైన మేఘాలు అలముకొని ఉండటంతో ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో పర్యటన రద్దయింది.