కోనసీమ: ఆత్రేయపురం మండలం లోల్ల ఓల్డ్ బ్రిడ్జ్ పంట కాలువ నందు ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఆత్రేయపురం ఎస్సై రాము ఆదివారం తెలిపారు. సుమారు 60 సంవత్సరాల ఆడ శవం నీటిపై తెలియాడుతున్నట్టు సమాచారం రాగా, తన సిబ్బందితో కలిసి వెళ్లి మృతదేహాన్ని కొత్తపేట ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతురాలి వివరాలు తెలిసినవారు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.