KRNL: అధిక వర్షాల కారణంగా రైతులు అప్రమత్తమై తమ పంటలను కాపాడుకోవాలని కోసిగి AO వరప్రసాద్ ఆదివారం ఒక వార్త తెలిపారు. నీటి ముంపునకు గురైనప్పుడు పత్తి పంట దెబ్బతింటుందన్నారు. పంటలో మురుగు నీటిని తొలగించి పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు 10 లీటర్ నీటికి లేదా నానో యూరియా 2-4 మి.లీ. 10 లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో మారుమారుగా పిచికారీ చేయాలన్నారు.