HYD: పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా ఉ. 8 గం. నుంచి రాత్రి 8 గం. వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 9010203626ను సంప్రదించాలన్నారు.