BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో ఆదివారం సోయం లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మేము సైతం మిత్రమండలి బాధిత కుటుంబాన్ని పరామర్శించి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. సభ్యులు మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి ఆసరాగా నిలవడం గర్వంగా ఉందన్నారు.