NLG: ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు, పట్టా పుస్తకాలు లైన్లో పెట్టి గంటలు తరబడి నిలబడి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండలో మాట్లాడుతూ.. రైతులు యూరియా కావాలని మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఘాటుగా విమర్శించారు.