దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు HDFC సేవలకు అంతరాయం ఏర్పడింది. UPI ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయినట్లు పలువురు వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. బ్యాలన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. అయితే, దీనిపై HDFC నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సమస్య మీకూ ఎదురైతే కామెంట్ చేయండి.