GDWL: ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి వరద కొనసాగుతోంది. ఆదివారం ప్రాజెక్టులోకి 1 లక్ష క్యూసెక్కుల నీరు చేరుకోవడంతో అధికారులు 9 స్పిల్ వే గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 62,406 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదనంగా, విద్యుత్ ఉత్పత్తి కోసం 38,271 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు వదులుతున్నారు.