పొలంలో పని చేసుకుంటున్న సురజియా భాయి అనే 65 ఏళ్ల మహిళపై నక్క విరుచుకుపడింది. ఆమెను 18 సార్లు కరిచింది. దీంతో 30 నిమిషాలపాటు దానితో పోరాడిన ఆమె తన చీర కొంగుతోనే నక్క మెడకు ఉచ్చు బిగించి చంపేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా బర్ఖాడీ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, ఆ తర్వాత స్పృహ కోల్పోయిన ఆమె 6 గంటల తర్వాత ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చారు.