MBNR: తిరుపతిలో నేడు ప్రారంభమైన మహిళా సాధికారత సదస్సుకు జిల్లా ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. మహిళా సాధికారత కమిటీ ఛైర్మన్ పురందేశ్వరి ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు, మహిళ ఆత్మ గౌరవాన్ని పెంచే దిశలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నట్లు తెలిపారు.