HYD: బూర్గుల రామకృష్ణా రావు వర్ధంతి సందర్భంగా లిబర్టీ క్రాస్ రోడ్లో ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బూర్గుల రామకృష్ణా రావు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాలకు బూర్గుల స్ఫూర్తిదాయక నేతగా నిలిచారన్నారు. వారి దూర దృష్టి మనందరికీ ఆదర్శమన్నారు.