శ్రీ సత్యసాయి జిల్లా కొత్త ఎస్పీగా సతీశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మాజీ ఎస్పీ రత్న చేతుల మీదుగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.