KMR: జిల్లా మద్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. టీ పాయింట్ నడిపే కుమ్మరి రాజు రెండున్నరేళ్ల చిన్నకుమారుడు ఆడుకుంటూ వెళ్లి ఆదివారం ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.