BDK: పాల్వంచలోని కుంటి నాగులగూడెం క్రాకర్స్ షాపు ఎదురుగా ఉన్న బాబాయ్ హోటల్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి చొరబడి సుమారు 20 వేల రూపాయల నగదుతో పాటు కిరాణా సామాగ్రిని దొంగలించారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.