KRNL: ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.