అన్నమయ్య: రాయచోటి పట్టణంలో వీధి కుక్కల బెడద పెరిగిపోతుంది. కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. రామాపురం, చౌడేశ్వరి దేవి గుడి పరిసరాల్లో పదుల సంఖ్యలో కుక్కలు రోడ్లపై తిరుగుతున్నాయి. NGO కాలనీ, రామాపురం దిశగా బైక్పై వెళ్లడానికి, నడుచుకుంటూ వెళ్లడానికి ప్రజలు భయపడుతున్నారు. స్కూల్ పిల్లలు వెళ్తూ వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.